September 16, 2021

మన ఊరు ఫిరంగిపురం

మన ఊరు… మన వార్తలు…

కనిపించని చలివేంద్రాలు…

DCIM100MEDIADJI_0001.JPG

ఫిరంగిపురం గ్రామంలో చలివేంద్రాలు ఎక్కడా కనిపించడం లేదు. ఒక పక్క రోజురోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోపక్క ప్రజలు పగటి వేళ బయట తిరగాలి అంటేనే భయపడుతున్నారు. రోడ్డు మీదకు వస్తే క్షణాల్లో దాహం. గతంలో ఫిరంగిపురంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన కూడళ్ల వద్ద ప్రభుత్వ అధికారులు, పాలకులు, స్వచ్ఛంద సంస్థలు మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ ఈ సంవత్సరం ఎక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. చిన్న పిల్లలతో బయటకు వచ్చే వాళ్ళు తప్పనిసరిగా వాటర్ బాటిల్ తో వస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మంచినీరు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.